నాగపురి హెచ్ఎం అయిలయ్యకు స్వర్ణ కంకణపురస్కారం!
హనుమకొండ వేదికగా ఘనంగా విశ్వకర్మ, తెలుగు వెలుగు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం సాహిత్య, సామాజిక సేవలకు గుర్తింపుగా ప్రముఖుల చేతుల మీదుగా సత్కారం చేర్యాల ప్రాంతానికి ఖ్యాతి తెచ్చిన ప్రధానోపాధ్యాయుడిపై వెల్లువెత్తిన ప్రశంసలు చేర్యాల (హిందుస్థాన్ మీడియా): హనుమకొండలో ఘనంగా జాతీయ పురస్కారాల వేడుక చేర్యాల మండల పరిధిలోని నాగపురి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు అయిలయ్యకు అరుదైన గౌరవం దక్కింది. ఆదివారం హనుమకొండలోని జయకృష్ణ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన 'విశ్వకర్మ మరియు తెలుగు వెలుగు' జాతీయ పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయనకు స్వర్ణ కంకణం ధరింపజేసి ఘనంగా సత్కరించారు. శ్రీ విరాట్ విశ్వకర్మ ఆధ్యాత్మిక ధార్మిక కళాపరిషత్, తెలుగు ఇండియన్ కల్చరల్ బుక్ ఆఫ్...