డాక్టర్ పోగొట్టుకున్న ఫోన్ ను గంటల్లోనే గుర్తించిన చేర్యాల పోలీసులు

చేర్యాల హోటల్‌ వద్ద లొకేషన్‌.. ఇంటింటా వెతికి ఫోన్‌ స్వాధీనం బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లకు డాక్టర్‌ కృతజ్ఞతలు సిద్దిపేట, సెప్టెంబర్‌ 27, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్‌ హిమజా తన Samsung S26 Ultra మొబైల్‌ ఫోన్‌ను సిద్దిపేటలో పోగొట్టుకోగా, ఫోన్‌ లొకేషన్‌ చేర్యాలలో చూపించడంతో చేర్యాల పోలీసులు వెంటనే స్పందించి ఫోన్‌ను గుర్తించి ఆమెకు అప్పగించారు. డాక్టర్‌ హిమజా ఫోన్‌ పోయిన విషయాన్ని గుర్తించి, ఫోన్‌ లొకేషన్‌ చేర్యాల పట్టణంలోని 05 Flavors హోటల్‌ పరిసరాల్లో చూపిస్తోందని చేర్యాల ఎస్‌ఐకి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ ఆదేశాల మేరకు బ్లూకోల్ట్స్‌ సిబ్బంది కానిస్టేబుళ్లు బాలకృష్ణ, బాలయ్య వెంటనే రంగంలోకి...