పేదల హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం!

ఘనంగా వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 26, హిందుస్థాన్ మీడియా: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మద్దూరు మండలం వల్లంపట్ల గ్రామంలో గ్రామస్తులు, యువకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, యువకులు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. భూస్వామ్య, జమీందారీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పేదల హక్కుల కోసం ఆమె సాగించిన పోరాటం చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుందని అన్నారు. పేద ప్రజలను...