చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఘన నివాళి
భూస్వామ్య దోపిడీ, సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి: నాయకులు కొండపాక, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కొండపాక మండల కేంద్రంలోని మర్పడగ గ్రామంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ నాటి సామాజిక రుగ్మతలు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటాన్ని నేటి తరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ...