ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంస్థాగత ప్రసవాలను పెంచాలి: డీఎంహెచ్‌ఓ డా.ఏంజెలా ఆల్ఫ్రెడ్‌

ఇల్లంతకుంట పీహెచ్‌సీలో వైద్య సేవలపై సమీక్ష తల్లి–శిశు ఆరోగ్యం, టీకాల కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్‌ 25, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల అమలు తీరుపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. ఏంజెలా ఆల్ఫ్రెడ్‌ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, తల్లి–శిశు ఆరోగ్య సేవలు, అసాంక్రమిక వ్యాధుల నియంత్రణ తదితర జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సంస్థాగత ప్రసవాల శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు, ఏఎన్‌ఎంలు, సూపర్‌వైజర్లు తమ...