సీసీ రోడ్డు వేశారు....పైపులు మరిచారు..!
ఇళ్ల మధ్యలో వర్షపు నీరు.. డ్రైనేజీ నీటితో కాలనీవాసుల అవస్థలు కాంట్రాక్టర్ నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం.. సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేర్యాల, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని 6వ వార్డులో ఇటీవల నిర్మించిన సీసీ రోడ్డు కాలనీవాసులకు ఇబ్బందులు తెచ్చిపెడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడినప్పుడు నీరు బయటకు వెళ్లేందుకు రోడ్డుకు అడ్డంగా పైపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటిని ఏర్పాటు చేయకుండానే సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వర్షం కురిసిన ప్రతిసారీ ఇళ్ల మధ్యలోనే నీరు నిలిచిపోతోందని చెబుతున్నారు. వర్షపు నీటికి తోడు డ్రైనేజీ నీరు, చెత్తాచెదారం కూడా చేరడంతో కాలనీ...