చేర్యాల మత్తడి స్థలం ఎవరి ఆధీనంలో?.. మున్సిపాలిటీదా..ముత్తిరెడ్డి దా..??
హిందుస్థాన్ మీడియా ప్రత్యేక కథనం ఏళ్లుగా తేలని పెద్ద చెరువు సర్వే నం. 1402 1402/A/1/1 మరియు 1402/A/1/2 భూ వివాదం నాడు ముత్తిరెడ్డి కుమార్తె హామీ... నేడు అధికారిక బదలాయింపుపై వీడని సందిగ్ధత రికార్డులు బహిర్గతం చేసి ప్రజాప్రయోజనాలకు కేటాయించాలని పట్టణ ప్రజల డిమాండ్ మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్నట్లయితే అధికారిక బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు? చేర్యాల (హిందుస్థాన్ మీడియా బ్యూరో): చేర్యాల పట్టణ నడిబొడ్డున ఉన్న పెద్ద చెరువు మత్తడి పరిధిలోని స్థలం వ్యవహారం ఏళ్లు గడుస్తున్నా ఇంకా సందిగ్ధంలోనే మగ్గుతోంది. సర్వే నంబర్లు 1402,1402/A/1/1 మరియు 1402/A/1/2 లోని ఈ కీలక స్థలం ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవాని పేరున 1270.0...