AISF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రామగళ్ల నరేష్,జేరిపోతుల జనార్ధన్
ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక విద్యారంగ సమస్యల పరిష్కారానికి పలు తీర్మానాలు చేర్యాల, సెప్టెంబర్ 25, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా ఏఐఎస్ఎఫ్ ఐదవ మహాసభలు చేర్యాలలో నిర్వహించగా, మహాసభల్లో నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ తెలిపారు.నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా రామగళ్ల నరేష్, జేరిపోతుల జనార్ధన్ ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షులుగా కనగండ్ల మల్లికార్జున్, బత్తుల రఘు, సహాయ కార్యదర్శులుగా వేల్పుల ప్రసన్నకుమార్, బరిగే భరత్, కోశాధికారిగా బత్తుల రంజిత్, జిల్లా గర్ల్స్ కన్వీనర్గా ఆకుల శిరీష, కో-కన్వీనర్లుగా ఉప్పరపల్లి పూజ, యశ్విత, అంబికలను ఎన్నుకున్నారు. వీరితో పాటు మరో 11 మంది కార్యవర్గ...