చినుకు పడితే చాలు.... గాంధీ ఏరియా చెరువే..!

ఇళ్ల మధ్య నిలిచిపోతున్న వర్షపు నీరు.. రోగాల భయంతో స్థానికుల ఆందోళన ​వర్షంలో తడుస్తూ రోడ్డుపై ధర్నా చేసినా అధికారుల్లో చలనం లేదు! ​శాశ్వత డ్రైనేజీ నిర్మించి మురుగు కాలువలకు నీటిని మళ్లించాలని కాలనీవాసుల డిమాండ్ ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​నీటిమడుగుగా మారుతున్న గాంధీ ఏరియా – యూనియన్ బ్యాంక్ పరిసరాలు ​చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు గాంధీ ఏరియా మరియు యూనియన్ బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య స్థానికులకు నిత్య నరకంగా మారింది. ఆకాశంలో కాస్త మబ్బు పట్టి ఒక్క చినుకు రాలినా సరే.. ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపిస్తోందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు...