రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి :AIFB

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలి విద్యాశాఖపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి: విద్యార్థి నేతల డిమాండ్‌ సిద్దిపేట, సెప్టెంబర్‌ 24, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాకాల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికం రాజశేఖర్ గౌడ్ హాజరై రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో విద్యారంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, అవసరమైన నిధులు కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని రాజశేఖర్ గౌడ్ కోరారు. విద్యార్థులకు...