విద్యార్థుల హక్కుల పరిరక్షణే లక్ష్యం: ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్
విద్యా వ్యతిరేక విధానాలపై నిరంతర ఉద్యమం చేర్యాలలో ఘనంగా ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా 5వ మహాసభలు చేర్యాల, సెప్టెంబర్ 24, హిందుస్థాన్ మీడియా: అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) సిద్దిపేట జిల్లా 5వ మహాసభలు చేర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. మహాసభల సందర్భంగా పట్టణ కేంద్రంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం, విద్యార్థుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన నినాదాలతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం చేర్యాలలోని వాసవి గార్డెన్లో ఏఐఎస్ఎఫ్ జెండాను జిల్లా నిర్మాణ బాధ్యులు మంద పవన్ ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా...