దుర్వాసనకు, ప్రమాదాలకు నిలయంగా హయత్నగర్–మదర్డెయిరీ రోడ్డు
లోతైన నాలా చుట్టూ చెత్తాచెదారం.. పిచ్చిమొక్కలతో ప్రమాదకర పరిస్థితి చిన్న బోర్డుతో సరిపెట్టిన అధికారులు.. అడ్డుగోడ ఎక్కడ? వై జంక్షన్ నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు శుభ్రం చేయాలని స్థానికుల డిమాండ్ హయత్నగర్, సెప్టెంబర్ 23, హిందుస్థాన్ మీడియా: హయత్నగర్ నుంచి కుంట్లూర్ వైపు వెళ్లే మదర్డెయిరీ రహదారి పరిసరాలు సమస్యలకు నిలయంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో సబ్స్టేషన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న లోతైన నాలా ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. నాలా చుట్టూ చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు భారీగా పేరుకుపోవడంతో రహదారి, నాలా మధ్య ఉన్న ప్రాంతం స్పష్టంగా కనిపించకపోవడం ప్రమాదాలకు కారణమవుతోందని స్థానికులు చెబుతున్నారు....