ఓటు హక్కు, ప్రజాస్వామ్య విలువల పై అవగాహన

మోడల్‌ స్కూల్‌లో ఘనంగా హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ ఎన్నికలు ఓటు హక్కు వినియోగించుకున్న 6వ తరగతి నుంచి సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు హెడ్‌బాయ్‌గా ఎండీ గబ్బర్‌.. హెడ్‌గర్ల్‌గా ఎస్‌.అక్షిత విజయం మద్దూరు, సెప్టెంబర్‌ 23, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల కేంద్రంలోని PM SHRI తెలంగాణ మోడల్‌ స్కూల్‌ అండ్‌ జూనియర్‌ కాలేజీలో హెడ్‌బాయ్‌, హెడ్‌గర్ల్‌ ఎన్నికలను మంగళవారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో పాఠశాల యాజమాన్యం ఈ ఎన్నికలను నిర్వహించింది.ఎన్నికల ప్రారంభ కార్యక్రమానికి జిల్లా సైన్స్‌ అధికారి రాజమల్లు, మద్దూరు మండల విద్యాధికారి వరదరాజు, TGMS మద్దూరు ప్రిన్సిపాల్‌...