‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’తో మొక్కల పెంపకానికి ప్రోత్సాహం

తల్లి పేరుతో ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటేలా అవగాహన సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో పాఠశాలల్లో కార్యక్రమాలు హిందుస్థాన్ మీడియా: విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడంతో పాటు చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కార్యక్రమాన్ని పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 22, 23 తేదీల్లో ప్రతి పాఠశాలలో విద్యార్థులు తమ తల్లి పేరుతో ఒక మొక్కను నాటేలా కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తల్లి పేరుతో మొక్కను నాటడం ద్వారా విద్యార్థుల్లో ప్రకృతిపై ప్రేమ, పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెంపొందుతుందని నిర్వాహకులు తెలిపారు. నాటిన మొక్కలను విద్యార్థులు స్వయంగా సంరక్షించేలా ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడటంలో...