సైబర్ నేరాలపై డి ఐ సంతోష్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
మహిళల భద్రత, రోడ్డు భద్రతపై ప్రత్యేక సూచనలు నేరం జరిగినా.. అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి హయత్‌నగర్, సెప్టెంబర్ 21, హిందుస్థాన్ మీడియా: ఇటీవల వరుస దొంగతనాలు, సైబర్ నేరాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హయత్‌నగర్ డీఐ సంతోష్ సూచించారు. మల్కాజ్‌గిరి సీపీ సుమతి ఆదేశాల మేరకు కుంట్లూర్ పరిధిలోని జయప్రకాష్ నగర్ కాలనీలోని పలు వినాయక మండపాల వద్ద సోమవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐ సంతోష్ మాట్లాడుతూ.. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్తగా...