సలాక్ర్ పూర్ పాఠశాల ప్రహరీ గోడకు భూమి పూజ
రూ.6 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మాణ పనులకు శ్రీకారం విద్యార్థుల భద్రతకు ప్రహరీ గోడ ఎంతో అవసరం: సర్పంచ్ గడపే మౌనిక అనిల్‌కుమార్ మద్దూరు, సెప్టెంబర్ 21, హిందుస్థాన్ మీడియా: మండలంలోని సలాక్ పూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) నిధుల ద్వారా సుమారు రూ.6 లక్షల అంచనా వ్యయంతో ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడపే మౌనిక అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థుల భద్రతతో పాటు పాఠశాల ఆవరణ పరిరక్షణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రహరీ...