మహిళా మండలి కొనుగోలు చేసిన ట్రాక్టర్ నిరుపయోగం!
కార్యాలయం ముందు తుప్పు పడుతున్న వాహనం.. మండల ప్రజల ఆగ్రహం ప్రజాధనం వృథా కాకుండా చర్యలు తీసుకోవాలి: గ్రామస్తుల డిమాండ్ సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 21, హిందుస్థాన్ మీడియా: మహిళా సంఘాల అభివృద్ధి, ఆదాయ వృద్ధి కోసం మద్దూరు మండల మహిళా మండలి సమాఖ్య ఆధ్వర్యంలో లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ట్రాక్టర్ ప్రస్తుతం నిరుపయోగంగా మారి కార్యాలయం ముందు తుప్పు పడుతుండటంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడాల్సిన ట్రాక్టర్ను వినియోగంలోకి తీసుకురాకుండా కార్యాలయం ముందు ఉంచడం వల్ల వాహనం విలువ తగ్గిపోవడంతో పాటు ప్రజాధనం వృథా అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....