మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న గ్యారాల శ్రీనివాస్ గౌడ్

రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు పరామర్శ.. ఆర్థిక సహాయం పెద్ద అంబర్‌పేట్, సెప్టెంబర్‌ 20, హిందుస్థాన్ మీడియా: తండ్రి వారసత్వంగా వచ్చిన సేవా దృక్పథాన్ని కొనసాగిస్తూ జీఎస్‌ సేవా సమితి చైర్మన్‌, మాజీ కౌన్సిలర్‌ గ్యారాల శ్రీనివాస్‌ గౌడ్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అంబర్‌పేట్‌ డివిజన్‌ పరిధిలోని రాజీవ్‌ గృహకల్పలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులను సింగపూర్‌ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే శ్రీనివాస్‌ గౌడ్‌ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ...