అక్రమంగా కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పెంచాలి: అందే బీరన్న డిమాండ్

అక్రమంగా కబ్జా చేసిన భూములపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి సిద్దిపేట, సెప్టెంబర్‌ 20, హిందుస్థాన్ మీడియా: ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో బోదాసు మైసయ్య అధ్యక్షతన జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి అందె బీరన్న మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో భూముల కబ్జాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు గత పది సంవత్సరాలుగా లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు చెందిన భూములను లాక్కొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని అందె బీరన్న ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ఆయా భూములను స్వాధీనం చేసుకుని పేద...