ఇల్లంతకుంట మండలంలో భూముల రీ -సర్వే
రైతుల సమక్షంలో ఎంజాయ్మెంట్ సర్వే విధానంపై అధికారుల అవగాహన భూముల హద్దులను రైతులే చూపించాలి.. అభ్యంతరాలకు అప్పీల్ అవకాశం రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట, సెప్టెంబర్ 19, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండలంలోని రహీంఖాన్పేట్, తిప్పాపూర్, జంగంరెడ్డిపల్లి, జవహర్పేట గ్రామాల్లో భూముల రీ-సర్వే (ఎంజాయ్మెంట్ సర్వే) నిర్వహణకు సంబంధించి శనివారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియ, రైతులు పాటించాల్సిన విధానాలు, సర్వే సమయంలో అందించాల్సిన ఆధారాలపై అధికారులు గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అన్ని సర్వే నంబర్లకు ఎంజాయ్మెంట్ సర్వే గ్రామాల్లోని అన్ని సర్వే నంబర్లకు ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దులు, అనంతరం గ్రామకంఠం, ప్రభుత్వ భూములు,...