ఖమ్మం పల్లిలో సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ రష్మీ పెరుమాళ్

నేరాల నియంత్రణతో పాటు సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కొండపాక, సెప్టెంబర్ 19: జిల్లా ప్రజల రక్షణ, భద్రతే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ శాఖ చేపట్టిన ‘సిద్దిపేట సురక్ష నేత్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఒకే రోజు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 310 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా సిద్దిపేట త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖమ్మంపల్లి గ్రామంలో దాత మంద బూదవ్వ లక్ష్మారెడ్డి ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన 20 సీసీ కెమెరాలను సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి కెమెరాలను ప్రారంభించిన అనంతరం సీపీ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు...