కొండపాక గురుకులం,పీహెచ్‌సీలో కలెక్టర్ హైమావతి ఆకస్మిక తనిఖీ

మధ్యాహ్న భోజనం నాణ్యత, వైద్య సేవలపై క్షేత్రస్థాయి పరిశీలన కొండపాక, సెప్టెంబర్ 19: కొండపాక మండలంలో జిల్లా కలెక్టర్ కె. హైమావతి శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపూలే తెలంగాణ బీసీ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక దృష్టి గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అన్నం, బెండకాయ ఫ్రై, పప్పు, సాంబారు, పెరుగు, గుడ్లను పరిశీలించి ఆహార పదార్థాల నాణ్యత, రుచి, పరిశుభ్రత, వంట విధానంపై...