అధికారులను నిలదీసిన మద్దూర్ మండల సర్పంచ్ లు
ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆగ్రహం గ్రామ సమస్యలపై గత సమావేశంలో చేసిన తీర్మానాల అమలుపైనా ప్రశ్నలు సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని, గ్రామాల్లో నిర్వహించే అధికారిక కార్యక్రమాలకు సర్పంచులకు సమాచారం ఇవ్వడం లేదని పలువురు సర్పంచులు అధికారులను నిలదీశారు. మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల స్పెషల్ ఆఫీసర్ ప్రకాశ్ అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై సర్పంచులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు స్థానిక సర్పంచులకు ముందస్తు సమాచారం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ ప్రకారం తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని వారు అధికారుల...