చేర్యాలలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

పాత బస్టాండ్ వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ నిజాం పాలన నుంచి హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్న నాయకులు చేర్యాల, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు వడ్లకొండ సంజీవులు గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సంజీవులు గౌడ్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటికీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో...