వెల్జిపూర్‌ విద్యుత్ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు స్థల పరిశీలన

వెల్జిపూర్‌ విద్యుత్‌ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు ఎమ్మెల్యే ఆదేశాలతో స్థల పరిశీలన చేపట్టిన అధికారులు రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండలంలోని వెల్జిపూర్‌ గ్రామంలో నూతన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు ప్రతిపాదించిన స్థలాన్ని గురువారం అధికారులు పరిశీలించారు. గ్రామ సర్పంచ్‌ నాయిని నవీన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ సురేష్‌ స్థలాన్ని పరిశీలించారు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి లభ్యత, రహదారి సౌకర్యం, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన అంశాలను అధికారులు పరిశీలించారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి అనువైన స్థలంపై అధికారులు వివరాలు సేకరించారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో కదిలిన ప్రక్రియ ఈ సందర్భంగా సర్పంచ్‌...