బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు
పెద్ద అంబర్పేట్లో జాతీయ జెండా ఆవిష్కరించిన బీజేపీ నాయకులు సర్దార్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం: బీజేపీ పెద్ద అంబర్పేట్, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: పెద్ద అంబర్పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు బాల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన నేపథ్యంలో ఈ రోజుకు చారిత్రక ప్రాధాన్యత ఉందన్నారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్...