చేర్యాలలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో అందరూ అభివృద్ధి చెందాలి: సంఘం అధ్యక్షుడు మెరుగోజు సత్యనారాయణ సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 17, హిందుస్థాన్ మీడియా: సృష్టికర్త, శిల్పకళా ప్రవీణుడు, విశ్వ నిర్మాత శ్రీ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వకర్మ భగవానుడి విగ్రహానికి సంఘ అధ్యక్షుడు మెరుగోజు సత్యనారాయణ పూలమాల వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి, జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెరుగోజు సత్యనారాయణ మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు మానవాళికి వడ్రంగం, శిల్పకళ, యంత్ర విద్య వంటి నైపుణ్యాలను అందించిన మహాశిల్పిగా విశ్వసిస్తారని తెలిపారు. విశ్వకర్మ భగవానుడి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశ అభివృద్ధిలో...