గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ ఆధ్వర్యంలో నానో యూరియా పై రైతులకు అవగాహన

ఎకరానికి లీటర్‌ నానో యూరియా సరిపోతుంది డ్రోన్‌ ద్వారా కూడా పంటలకు స్ప్రే చేసుకోవచ్చు: ఏడీఏ బాబు నాయక్ సిద్దిపేట జిల్లా, కుకునూర్‌పల్లి, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: నానో యూరియా వినియోగం, పంటల్లో దాని ఉపయోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు కుకునూర్‌పల్లి మండలం మేదినీపూర్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆత్మ ఆధ్వర్యంలో గజ్వేల్ వ్యవసాయ డివిజన్ అధికారి బాబు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు నానో యూరియా వినియోగంపై వివరించారు. ఈ సందర్భంగా ఏడీఏ బాబు నాయక్ మాట్లాడుతూ వివిధ పంటల్లో ఏ దశలో నానో యూరియాను ఎలా వినియోగించాలి అనే అంశాలను రైతులకు వివరించారు. సాధారణ యూరియాతో...