అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందేలా చూడాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్
నేటి నుంచి ఈ నెల 25 వరకు క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: చేయూత సామాజిక భద్రత పెన్షన్ల పథకం కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతలను క్షేత్రస్థాయిలో సమగ్రంగా, పారదర్శకంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చేయూత పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో మంగళవారం అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బుధవారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు పెన్షన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రతి దరఖాస్తును ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాల ప్రకారం క్షుణ్ణంగా...