2027 జనాభా లెక్కల్లో 21 రకాల వైకల్యాల వివరాలు నమోదు చేయాలి: అడివయ్య
ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి సెప్టెంబర్ 25–30 వరకు దేశవ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు: ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య సిద్దిపేట, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: 2027 జనాభా లెక్కల్లో దివ్యాంగుల హక్కుల చట్టం–2016 కింద గుర్తించిన 21 రకాల నిర్దిష్ట వైకల్యాల వివరాలను విడివిడిగా నమోదు చేయాలని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అడివయ్య డిమాండ్ చేశారు. సిద్దిపేట పట్టణంలోని కార్మిక, కర్షక భవన్లో ఎన్పీఆర్డీ జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఎం.డి. సాజిద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా అడివయ్య హాజరై మాట్లాడారు. 2027 జనాభా...