బైరాన్ పల్లి మహిళల పోరాటం స్ఫూర్తిదాయకం: మల్లు లక్ష్మి

నిజాం, రజాకారులు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా మహిళలు వీరోచితంగా పోరాడారు బైరాన్‌పల్లి పోరాట స్ఫూర్తితో మహిళా హక్కుల కోసం ఉద్యమిస్తాం: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బైరాన్‌పల్లి మహిళలు సాగించిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరవనితలను స్మరించుకుంటూ ఐద్వా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్ఫూర్తి యాత్ర మంగళవారం పాలకుర్తిలో ప్రారంభమై కడవెండి మీదుగా వీర బైరాన్‌పల్లికి చేరుకుంది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్రకు గ్రామాల్లో...