సెప్టెంబర్ 17న జరిగే సంస్మరణ సభను జయప్రదం చేయండి : సీపీఎం నాయకులు

బైరాన్‌పల్లి బురుజు వద్ద సభా ఏర్పాట్లను పరిశీలించిన సీపీఎం నాయకులు సభకు బీవీ రాఘవులు, చుక్క రాములు ముఖ్య అతిథులు సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 15, హిందుస్థాన్ మీడియా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 17న వీరభైరాన్‌పల్లిలో నిర్వహించనున్న బైరాన్‌పల్లి అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సీపీఎం జిల్లా కమిటీ బృందం బైరాన్‌పల్లి అమరవీరుల స్మారక చిహ్నమైన బురుజును, సభ నిర్వహించనున్న ప్రదేశాన్ని పరిశీలించింది. ఈ నెల 17న జరిగే సంస్మరణ సభకు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చుక్క...