జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఎం.డి సయ్యద్
అయినాపూర్ జెడ్పీహెచ్ఎస్ తెలుగు ఉపాధ్యాయుడికి ఘన గౌరవం సిద్దిపేట జిల్లా, కొమురవెల్లి, సెప్టెంబర్ 12, హిందుస్థాన్ మీడియా: కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ఎం.డి. సయ్యద్ సిద్దిపేట జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు యం. రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ శ్రీమతి కె. హైమావతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత ఎం.డి. సయ్యద్ మాట్లాడుతూ ఉపాధ్యాయుడిగా విద్యారంగంలో తనదైన గుర్తింపు సాధించడంతో పాటు రచయితగా, కవిగా సామాజిక అంశాలపై అనేక కార్యక్రమాలు నిర్వహించినందుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైనట్లు...