విద్యుత్ సరఫరా కోసం రాజీవ్ రహదారిపై ధర్నా..

సాగుకు 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని రైతుల డిమాండ్‌ రేపటి నుంచి పాత పద్ధతిలో విద్యుత్‌ సరఫరా చేస్తాం: ఏఈ సత్యం సిద్దిపేట జిల్లా, దుద్దెడ, సెప్టెంబర్ 12, హిందుస్థాన్ మీడియా: వ్యవసాయానికి 12 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేస్తూ బందారం, అంకిరెడ్డిపల్లి, దర్గా, రాంపల్లి, దుద్దెడ గ్రామాలకు చెందిన రైతులు శనివారం దుద్దెడ సబ్‌స్టేషన్‌ వద్ద రాజీవ్‌ రహదారిపై ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్‌ శాఖ ఏఈ సత్యంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వ్యవసాయానికి నిర్ణీత సమయం మేరకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నప్పటికీ తరచూ అంతరాయాలు ఏర్పడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు....