ప్రయాణికుల కోసం నిర్మిస్తున్న సౌచాలయాలకు మోక్షం ఎన్నడో..??

నిర్మాణం నత్తనడకన.. మూడేళ్లుగా పూర్తికాని పనులు మహిళలు, వృద్ధులు, చిన్నారులకు తప్పని ఇబ్బందులు సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 12, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మిస్తున్న మరుగుదొడ్ల పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్‌ పరిసరాల్లో ప్రయాణికుల అత్యవసర అవసరాల కోసం మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టినప్పటికీ గత మూడేళ్లుగా పనులు పూర్తికాకపోవడంతో అవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రతిరోజూ బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు మరుగుదొడ్ల సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు....