సింప్లీ ఫ్రెష్ లో మహిళలను వేధించిన సూపర్వైజర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి:సీఐటీయూ డిమాండ్

​మహిళా కార్మికుల పట్ల అసభ్య ప్రవర్తన.. ఆటవిక పాలనను తలపిస్తున్న యాజమాన్య వైఖరి ​పరిశ్రమలో అంతర్గత మహిళా రక్షణ కమిటీ (ICC)ని వెంటనే ఏర్పాటు చేయాలని డిఐటియు డిమాండ్ ​జీవో నంబర్ 6 ప్రకారం కనీస వేతనాలు, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి: జిల్లా నేతలు ఎల్లయ్య, గోపాలస్వామి ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​చేర్యాల మండల పరిధిలోని అర్జున్‌పట్ల గ్రామ శివారులో గల 'సింప్లీ ఫ్రెష్' వ్యవసాయ ఆధారిత పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికులను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్న సూపర్వైజర్‌ను తక్షణమే ఉద్యోగం నుండి తొలగించి, అతనిపై కఠిన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం సీఐటీయూ...