రాజన్న ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్

వీటీఏడీఏ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ గరిమ అగ్రవాల్ 80 ఫీట్ల రోడ్డు, బద్ది పోచమ్మ ఆలయం, నిత్యాన్నదాన సత్రం పనులపై సమీక్ష రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (వీటీఏడీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు నిత్యాన్నదాన సత్రం, బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను ఆర్‌అండ్‌బీ, ఇతర...