మద్దూరు ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం

ప్రతి ఏటా ఉపాధ్యాయులను సన్మానిస్తా: సర్పంచ్ దామెర మల్లేశం విద్యతో పాటు ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవాలి: ప్రిన్సిపల్ నరేందర్ రెడ్డి సిద్దిపేట జిల్లా, మద్దూరు, సెప్టెంబర్ 9, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దామెర మల్లేశం మాట్లాడుతూ ఉపాధ్యాయులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గతంలో తాను ఎంతోమంది విద్యార్థులకు క్రీడల్లో శిక్షణ ఇచ్చానని, ప్రస్తుతం వారిలో కొందరు వార్డు సభ్యులుగా, ఉపాధ్యాయులుగా సమాజానికి సేవలందించడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులతో...