కొండాపూర్ లో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా మంద రాకేష్.. కార్యదర్శిగా మంద హరీష్ దూల్మిట్ట, సెప్టెంబర్ 5, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, జిల్లా ఇన్‌చార్జ్ మంద కుమార్ మాదిగ, జిల్లా కన్వీనర్ ముక్కపల్లి రాజు మాదిగ, కో-ఇన్‌చార్జ్ మల్లిగారి యాదగిరి మాదిగ ఆదేశాల మేరకు కమిటీ ఎన్నిక జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు నల్ల రాజేష్ మాదిగ హాజరై మాట్లాడుతూ కుల, మత వివక్ష పూర్తిగా తొలగిపోయే వరకు, దళితులపై దాడులు ఆగే వరకు ఉద్యమం కొనసాగుతుందని అన్నారు. ఉద్యమంలో యువత చురుకైన పాత్ర పోషించి...