ప్రెజెంటేషన్ హైస్కూల్లో ఘనంగా స్వయం పాలన దినోత్సవం
ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు.. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చేర్యాల, సెప్టెంబర్ 5, హిందుస్థాన్ మీడియా: చేర్యాల ప్రెజెంటేషన్ హైస్కూల్లో విద్యార్థుల ఆధ్వర్యంలో స్వయం పాలన దినోత్సవం, ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల మేనేజర్ రెవ. సిస్టర్ ధన్యా జోసెఫ్, ప్రిన్సిపాల్ రెవ. సిస్టర్ జ్యోతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉత్సాహభరితంగా జరిగాయి. స్వయం పాలన దినోత్సవంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయుల బాధ్యతలు, క్రమశిక్షణ, సమయపాలన, విద్యార్థుల పట్ల బాధ్యతలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులు గురువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను కొనియాడారు. ఉపాధ్యాయుల పట్ల గౌరవం, కృతజ్ఞతను చాటుతూ వివిధ సాంస్కృతిక...