విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం :సర్పంచ్ దామెర మల్లేశం
10వ తరగతి ఉత్తీర్ణులకు సర్పంచ్ నగదు ప్రోత్సాహకం మద్దూరు, సెప్టెంబర్ 5, హిందుస్థాన్ మీడియా: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని మద్దూరు గ్రామ సర్పంచ్ దామెర మల్లేశం అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మద్దూరు ZPHSలో ప్రధానోపాధ్యాయులు సర్వర్ మొహియుద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి మండల విద్యాధికారి జి. వరదరాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్ మల్లేశం ప్రభుత్వ పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల, మండల విద్యా వనరుల కేంద్రం, ప్రీ-ప్రైమరీ పాఠశాల, భవిత కేంద్రం ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. 2026లో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులతో నగదు ప్రోత్సాహకాలు అందజేశారు....