విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సామాజిక విలువలు, క్రమశిక్షణను బోధించాలి విద్యార్థులకు ఉపాధ్యాయులే రోల్ మోడల్స్ 37 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: విద్యార్థులను విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని శనివారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జయ జయహే...