నిరుపేద కుటుంబానికి రెండు లక్షల ఎల్ఓసి అందజేత
వెంటనే స్పందించిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు నాగపురి కిరణ్కుమార్ గౌడ్ బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి దూల్మిట్ట, సెప్టెంబర్ 4, హిందుస్థాన్ మీడియా: అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేద కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు అండగా నిలిచారు. దూల్మిట్ట మండలం కూటిగల్ గ్రామానికి చెందిన గుండారపు సిద్ధమ్మ గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ వైద్య చికిత్స పొందుతున్నారు. ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో చికిత్స ఖర్చులు భరించడం కష్టంగా మారిన విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నాగపురి కిరణ్కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నాగపురి కిరణ్కుమార్...