పదో తరగతి మిత్రుల ఆత్మీయ కలయిక
విద్యారంగంలో సేవలందిస్తున్న మిత్రులకు ఘన సన్మానం చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు ఇల్లంతకుంట, హిందుస్థాన్ మీడియా: పదో తరగతి మిత్రుల ఆధ్వర్యంలో విద్యారంగంలో సేవలందిస్తున్న తమ పాత మిత్రులను ఘనంగా సన్మానించారు. గురువారం ఇల్లంతకుంటలో నిర్వహించిన ఆత్మీయ కలయిక కార్యక్రమంలో రహీం ఖాన్పేట్ మోడల్ స్కూల్ ప్రభుత్వ ప్రిన్సిపాల్ గుడేల్లి అంజయ్య, వాణినికేతన్ పాఠశాల ఉపాధ్యాయుడు తునికి తిరుపతిలను పదో తరగతి మిత్రులు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చాలాకాలం తర్వాత పాత మిత్రులంతా ఒకేచోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల రోజుల్లో గడిపిన మధుర స్మృతులను గుర్తుచేసుకుంటూ పరస్పరం ఆత్మీయంగా పలకరించుకున్నారు. అప్పటి స్నేహాలు, సరదా సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఆనందంగా...