సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు స్కూల్ యూనిఫాంల పంపిణీ

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి: సర్పంచ్ కనకమ్మ లింగయ్య వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, ధర్మారం, ఆగస్టు 25: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అందజేసిన ఉచిత పాఠశాల యూనిఫాంలను ధర్మారం గ్రామ సర్పంచ్ కనకమ్మ లింగయ్య చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ఉచిత యూనిఫాంలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు. వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అనంతరం వన మహోత్సవం కార్యక్రమంలో...