అర్హులైన గీత కార్మికులు పెన్షన్ కు దరఖాస్తు చేసుకోవాలి: ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్

11 మంది గీత కార్మికులకు ఐడీ కార్డులు పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా, హిందుస్థాన్ మీడియా: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని 11 మంది గీత కార్మికులకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ సోమవారం గీత కార్మిక ఐడీ కార్డులను పంపిణీ చేశారు. పెన్షన్‌కు అర్హత కలిగిన గీత కార్మికులు ఐడీ కార్డులను కలిగి ఉంటే సంబంధిత పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ 50 సంవత్సరాలు నిండిన, అర్హత కలిగిన గీత కార్మికులు ఐడీ కార్డులు పొందిన అనంతరం పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. అర్హులైన ప్రతి గీత కార్మికుడు...