పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోన్న మద్దూరు ఎంపీడీవో కార్యాలయం
పాములు, విషజీవుల భయంతో ప్రజలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారిన కార్యాలయ ఆవరణ సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, మద్దూరు, ఆగస్టు 24: మండల పరిపాలనకు కేంద్రంగా ఉండాల్సిన మద్దూరు మండల పరిషత్ కార్యాలయం ప్రస్తుతం పిచ్చి మొక్కలు, మోకాలి ఎత్తు గడ్డితో దర్శనమిస్తోంది. కార్యాలయం చుట్టూ, ఆవరణలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పారిశుద్ధ్య పరిస్థితిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాకాలం కావడంతో గడ్డి, పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగినా వాటిని తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వివిధ పనుల కోసం గ్రామాల నుంచి వచ్చే రైతులు, మహిళలు పిచ్చి మొక్కల మధ్య నుంచే...