దళిత జర్నలిస్టుల ఫోరం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా కర్రోళ్ల నవజీవన్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కర్రోళ్ల నవజీవన్ చేర్యాల, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా కర్రోళ్ల నవజీవన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు జర్నలిస్టులు, దళిత జర్నలిస్టుల ఫోరం సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కర్రోళ్ల నవజీవన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి సిద్దిపేట జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. డేవిడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను నిబద్ధతతో నిర్వహిస్తూ జిల్లాలోని దళిత జర్నలిస్టుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారుల...