వీధి కుక్కలతో జంకుతున్న ప్రజలు

రోజురోజుకూ పెరుగుతున్న కుక్కల బెడద.. పట్టించుకోని సంబంధిత అధికారులు పిల్లలు, మహిళలు, వృద్ధుల భద్రతపై ఆందోళన కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని మద్దూరు మండల ప్రజల డిమాండ్ సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా, ఆగస్టు 24: మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రధాన వీధులు, కాలనీలు, పాఠశాలల పరిసరాల్లో కుక్కలు గుంపులుగా సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనే జంకుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను తల్లిదండ్రులు ఒంటరిగా పంపేందుకు భయపడుతున్నారు. కుక్కలు ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన...