ఎల్లారెడ్డిపేటలో ప్రజావాణిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

మండలస్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్ చేయూత పెన్షన్ దరఖాస్తులపై ఆరా హిందుస్థాన్ మీడియా, ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 24: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్న మండలస్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. సోమవారం ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజావాణికి హాజరైన వివిధ శాఖల మండలస్థాయి అధికారుల వివరాలను పరిశీలించిన కలెక్టర్, గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కరించారనే అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా...